తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- January 06, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410కు పెరిగింది.. ఇక, 472 మంది తాజాగా కోలుకోవడంతో.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,81,872కు చేరింది.. మరో ఇద్దరు మృతిచెందగా.. 1556కు పెరిగింది మృతుల సంఖ్య.. కరోనా మృతుల సంఖ్య దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గినట్టు, కరోనా రికవరీ రేటు భారత్‌లో 96.3 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.73 శాతానికి పెరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 4,982 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో 2,748 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు.. మంగళవారం రాష్ట్రంలో 43,318 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్టు.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 71,04,367కు పెరిగినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







