Dh315 మిలియన్ల ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించిన దుబాయ్
- January 06, 2021
దుబాయ్:కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొని వ్యాపార రంగం నిలదొక్కుకునేందుకు దుబాయ్ పాలనా యంత్రాంగం తమ శక్తి మేర ప్రయత్నాలను కొనసాగిస్తోంది.ఇందులో భాగంగా వరుసగా ఐదో సారి ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించింది.ఈ సారి Dh315 మిలియన్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు.దీంతో ఇప్పటివరకు పలు రంగాలకు ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించిన సహాయ ప్యాకేజీ విలువ Dh 7.1 బిలియన్లకు చేరుకుంది.దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని మార్గనిర్దేశకాలకు అనుగుణంగా ప్రస్తుత ప్యాకేజీని ప్రకటించారు.వచ్చే జూన్ వరకు ఈ ఉద్దీపన ప్యాకేజీని పలు రంగాలకు సహాయంగా అందించనున్నారు.కరోనా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, అయితే..ఇతర దేశాలతో పోలిస్తే తమ ఆర్ధిక రంగం స్థిరంగా పుంజుకుంటోందని షేక్ హమ్దాన్ వెల్లడించారు. తమ శక్తి సామార్ధ్యాలు, తమకున్న వనరులు...కింగ్డమ్ పరిధిలోని పలు వ్యాపార రంగాలు త్వరతగతిన తిరిగి పంజుకునేందుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ప్రకటించే ప్యాకేజీలు కొత్త ప్యాపారాలకు, కొత్తగా పెట్టుబడులకు అవశమార్గాలుగా మారుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







