తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం
- January 07, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్ హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. కాగా, జస్టిస్ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలువడం విశేషం. 1959 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పుట్టిన జస్టిస్ హిమ కోహ్లీ 1979లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బీఏ ఆనర్స్ హిస్టరీలో డిగ్రీ అందుకున్నారు. తరువాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో సభ్యురాలిగా నమోదై.. న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులైన పిమ్మట, 15 నెలల సర్వీస్ తర్వాత పూర్తిస్థాయి జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం జస్టిస్ హిమా కోహ్లీకి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం