'కోబ్రా' టీజర్ విడుదల
- January 09, 2021చెన్నై:తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ సినిమా అంటే చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం విక్రమ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోబ్రా పేరును పెట్టారు. ఇందులో విక్రమ్ మాథమెటిక్స్ జీనియస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పథాన్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ప్రపంచంలో ఏ సమస్యకైనా మాథమెటికల్ లేదా లాజికల్‌గా కానీ సమాధానం కచ్చితంగా ఉంటుందని అంటుంటాడు. అటువంటిది ఓ బిజినెస్ దిగ్గజం కారణంగా పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. అందులో నుంచి ఎలా బయటపడ్డానేది కథ. అయితే టీజర్ మాత్రం ఎంతో గొప్పగా తయారు చేశారు. ఈ సినిమా డిమాంటీ కాలనీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కతోంది. అంతేకాకుండా ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఇర్ఫాన్ పథాన్ కూడా అద్భుతంగా నటించాడు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..