దుబాయ్‌లో ఉచిత వ్యాక్సిన్: 7 కేంద్రాల్లో లభ్యం

- January 09, 2021 , by Maagulf
దుబాయ్‌లో ఉచిత వ్యాక్సిన్: 7 కేంద్రాల్లో లభ్యం

దుబాయ్:దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) - ఏడవ సెంటర్‌ని కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి ప్రకటించడం జరిగింది. ఈ సెంటర్లలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన సెంటర్ల వివరాలకు వస్తే అల్ సఫా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, జబీల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, అల్ మిఝార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, నద్ అల్ హమర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, అల్ బర్షా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, మిర్దిఫ్ మెడికల్ ఫిట్‌నెస్ సెంటర్, హట్టా హాస్పిటల్‌లో కరోనా వ్యాక్సిన్ లభ్యమవుతోంది. ప్రస్తుతం 60 ఏళ్ళ వయసు పైబడినవారికి, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వైటల్ సెక్టార్ వర్కర్స్‌కి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com