ఏ.పీ‌లో కొత్తగా 199 కరోనా కేసులు

- January 09, 2021 , by Maagulf
ఏ.పీ‌లో కొత్తగా 199 కరోనా కేసులు

అమరావతి:ఏ.పీ‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689కి చేరింది. కొత్తగా రాష్ట్రంలో ఒకరిని కరోనా బలి తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ శనివారం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్‌లో తెలిపింది.  దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,128 మంది కొవిడ్‌ కారణంగా మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 423 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,74,954కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,607 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,22,74,647 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

--ఆ.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com