బస్సులు, ట్యాక్సీల కోసం దుబాయ్ లో ప్రత్యేకంగా లేన్లు..ఈ నెల 21న ప్రారంభం
- January 09, 2021
దుబాయ్:పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో ప్రయాణాన్ని మరింత మెరుగు పరిచే దిశగా దుబాయ్ రవాణా సంస్థ కీలక లక్ష్యాన్ని సాధించింది. బస్సులు, ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లను ఈ నెల 21న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్- అల్ మిన్ స్ట్రీట్ మధ్య తొలిగా ట్రయల్ రన్ ప్రారంభించబోతున్నారు. రహదారి మధ్యలో బస్సులు, ట్యాక్సీలు మాత్రమే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. బస్సులు వెళ్లే దారిని రెడ్ కలర్ తో మార్క్ చేశారు. మూడో విడత పనుల్లో భాగంగా ప్రస్తుతానికి 4.3 కి.మీ. మేర స్పెషల్ లేన్ లను సిద్ధం చేశారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 11.6 కి.మీ. మేర అల్ మంఖూల్, అల్ ఖలీజ్, ఖలీద్ బిన్ అల్ వలీద్, అల్ ఘుబైబా, నైఫ్, అల్ ఇతిహాద్ మరియు అల్ మినా స్ట్రీట్లలో స్పెషల్ లేన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రత్యేక రహదారులలో మొత్తం 40 బస్సులు అలాట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు సమయం కలిసి వస్తుందని...దాంతో ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గి జనం..ప్రజా రవాణా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. స్పెషల్ లేన్ల ద్వారా ప్రయాణికులు గతంలో కంటే 5 నిమిషాల ముందుగా గమ్యాన్ని చేరుకుంటారని, వారి ప్రయాణ సమయం 24 నిమిషాల పాటు ఆదా అవుతుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







