రెండో విడతగా ఈ వారంలో కువైట్ కు చేరుకోనున్న కోవిడ్ వ్యాక్సిన్
- January 10, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ బయోన్టెక్ రెండో విడత రవాణా ఈ వారంలోనే ఉంటుందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే తొలి విడతగా కోవిడ్ వ్యాక్సిన్ కువైట్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అత్యవసర అనుమతులు పొందగానే ఒప్పందం మేరకు డిసెంబర్ 23న ఫైజర్ వ్యాక్సిన్ కువైట్ కు దిగుమతి అయ్యింది. ఆ మరుసటి రోజు నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. పక్కా ఏర్పాట్లతో మిష్రిఫ్ లోని ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ లో సెంటర్ హాల్ 5లో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అయితే..ప్రస్తుతం రెండో విడతగా ఈ వారంలో వ్యాక్సిన్ రానుందని...ఇలా విడతలు విడతలుగా దేశంలోని పౌరులు, ప్రవాసీయులు అందరికీ వ్యాక్సిన్ అందేవరకు దిగుమతి జరుగుతుందని ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







