వాటర్‌ ఏటీఎంలు హైదరాబాద్ లో

- February 22, 2016 , by Maagulf
వాటర్‌ ఏటీఎంలు హైదరాబాద్ లో

రూపాయికే లీటర్‌ నీరు ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : రూపాయికే లీటర్‌ నీటిని అందించేందుకు వాటర్‌బోర్డు కసరత్తు చేస్తోంది. వేసవి నేపథ్యంలో పౌరుల దాహార్తి తీర్చేందుకు వినూత్నంగా వాటర్‌ కియో్‌స్కలు ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎనీ టైం మనీ(ఏటీఎం) కేంద్రాల తరహాలో ఎక్కడైనా అతి తక్కువ ధరకే నీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రూ.1 కే లీటర్‌ నీటిని అందించే కియో్‌స్కల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని బోర్డు మెనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి సోమవారం జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రూపాయి కాయిన్‌ వేసి లీటర్‌ నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వేసవిలో అక్కడక్కడా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు చలివేంద్రాలు ఏర్పాటుచేసి ఉచితంగా నీటిని అందుబాటులో ఉంచుతాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ లోపం, ఇతర కారణాల నేపథ్యంలో ఎక్కువ మంది ఆ కేంద్రాల వద్ద నీళ్లు తాగేందుకు ఇష్టపడరు. గ్రేటర్‌లో సరఫరా చేస్తున్న నీటినే పరిశుభ్ర వాతావరణంలో ఈ కియో్‌స్కలలో ఒక్క రూపాయికే విక్రయించాలని యోచిస్తున్నారు. ఆ రూపాయి కూడా అక్కడ ఏర్పాటుచేసే సిబ్బంది, నిర్వహణ ఖర్చు కోసమే అని బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రధాన రహదారులు, ఫుట్‌పాతలు విశాలంగా ఉన్న చోట కియో్‌స్కలు నిర్మించే అవకాశం ఉంది. తాగేందుకు తప్ప... లీటర్ల కొద్ది నీళ్లు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదని ఓ అధికారి చెప్పారు. ఢిల్లీలో ఇలా... ఇప్పటికే ఢిల్లీలో ఈ తరహా విధానం అమల్లో ఉంది. అక్కడ తాగడంతో పాటు రూ. 3కు 20 లీటర్ల చొప్పున ఇళ్లకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com