బహ్రెయిన్:సెల్ఫ్ స్పాన్సర్లకు ఆన్ లైన్లో రెసిడెన్సీ పర్మిట్...
- January 10, 2021
            మనామా:బహ్రెయిన్ లో ఎవరి స్పాన్సర్ షిప్ లేకుండానే నివాస అనుమతులను దాలనుకుంటున్నారా? అయితే..మీరు http://www.evisa.gov.bh.వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ స్పాన్సర్ గా వివరాలను నమోదు చేసుకొని నివాస అనుమతులు పొందవచ్చు. బహ్రెయిన్ లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించటంలో భాగంగా బహ్రెయిన్ సెల్ఫ్ స్పాన్సర్లకు రెసిడెన్సీ అనుమతలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఇక నుంచి సెల్ఫ్ స్పాన్సర్లు వ్యక్తిగతంగా హజరు కాకుండా ఆన్ లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకొని రెసిడెన్సీ పర్మిట్ పొందేలా బహ్రెయిన్ ప్రస్తుత వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. అంతేకాదు.. అర్హులైన విదేశీయులు 17399764కు ఫోన్ చేసి కూడా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే [email protected] కు మెయిల్ కూడా చేయవచ్చు. రిటైర్ అయిన విదేశీయులు, బహ్రెయిన్ లో ఆస్తులు కలిగిన వారు, ఇన్వెస్టర్ల కోసం బహ్రెయిన్ ఈ సదుపాయాన్ని కల్పించింది. అర్హత కలిగిన విదేశీయులు రెండు, ఐదు, పది సంవత్సరాల నిడివి గల నివాస అనుమతులు పొందవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







