సౌదీ అరేబియాలో భారీ వర్షాలు...హైల్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరద
- January 10, 2021
రియాద్:భారీ వర్షాల కారణంగా సౌదీలోని హైల్ ప్రాంతం వరద తాకిడికి గురైంది. ప్రధాన నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల తాకిడికి అసిర్ ప్రాంతంలో ఓ పిల్లాడు నీటి కొట్టుకుపోయాడు. అయితే..అది గమనించిన ఓ స్థానికుడు పిల్లాడ్ని సురక్షితంగా రక్షించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలాఉంటే..వరదల కారణంగా హైల్ ప్రాంతంలో చాలా మంది పౌరులు, ప్రవాసీయులు ప్రధాన రహదారిపై చిక్కుకుపోయినట్లు కూడా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే..వరదలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు చిక్కులు తప్పలేదు. వాహనాల్లో నావిగేషన్ వ్యవస్థ స్థంభించిపోవటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సహాయం చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







