అయ్యప్ప భక్తులకు శుభవార్త..త్వరలో శబరిమలకు డైరెక్ట్ రైలు.. !
- January 11, 2021
తిరువనంతపురం: శబరిమలకు నేరుగా చేరుకోవలంటే ఏ రైలులో వెళ్లాలి..? అంటే కచ్చితంగా సరైన సమాధానం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు శబరిమలకు డైరెక్టుగా రైలు మార్గమే లేదు. శబరిమల వెళ్లాలనుకునేవారు కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్ వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి బస్సులు, కార్లలో పంబకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుంది. పంబకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి కాలినడకన శబరిమలకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఎట్టకేలకు శబరిమలకు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కేరళ ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రాజెక్టలో తాము 50 శాతం ఖర్చు భరిస్తామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో దశాబ్దాలుగా భక్తులు ఎదురు చూస్తున్న రైలు మార్గం కల సాకారమైంది.
ఎప్పుడో 1998లో ఎర్నాకులంలోని అంగమలై నుంచి కొట్టాయం లోని ఎరుమేలి వరకు 111 కిలోమీటర్ల రైలు మార్గం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించింది. ఇది శబరిమలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శబరిమలతో పాటు అనేక ఆలయాలను కలుపుతూ ఈ రైల్వేలైను వెళుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు విషయంలో కేంద్రానికి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల నుంచి ప్రాజెక్టు వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర షరతులకు తలూపింది. రైలు మార్గానికయ్యే ఖర్చులో 50 శాతం భరిచేందుకు ఒప్పుకుంది. దీంతో దశాబ్దాల నాటి భక్తుల కల నెరవేరినట్లేది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







