భారత్:ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఉచితం

- January 11, 2021 , by Maagulf
భారత్:ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఉచితం

న్యూఢిల్లీ:జనవరి 16 నుండి ప్రారంభమయ్యే సామూహిక వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ కోరారు. కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ముఖ్యమంత్రులతో చర్చించారు. మొత్తంగా 30 కోట్ల మందికి కేంద్రం వ్యాక్సిన్‌ అందించనుంది. తొలి ప్రాధాన్యతగా కరోనా సమయంలో ముందుండి సేవలందించిన 3 కోట్ల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్‌ను అందిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యారోగ్య సిబ్బందికి అందించే వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా 50 ఏళ్లకు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై నాటికి మిగిలిన 27 కోట్ల మంది ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న 3 కోట్ల మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్‌ అందించాలని అనుకుంటున్నామని, కానీ ఈ ఖర్చును రాష్ట్రాలు భరించనవసరం లేదని, కేంద్రమే భరిస్తుందని...ముఖ్యమంత్రులకు మోడీ భరోసా నిచ్చారు. భారత్‌లో మాత్రమే వ్యాక్సిన్‌ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుందని, ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రొటోకాల్‌ను అనుసరించాలని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com