సీరమ్ సంస్థ కీలక ప్రకటన..వ్యాక్సిన్ ధర 300/1000 రూపాయలట
- January 12, 2021
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరమ్ సంస్థ కీలక ప్రకటన చేసింది.
తాము భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తొలి 100 మిలియన్ డోసుల (10 కోట్ల డోసులు) వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ.200 చొప్పున విక్రయిస్తున్నామని పూనావాలా చెప్పారు.
దేశంలోని సామాన్య ప్రజలు, అణగారిన వర్గాలు, నిరుపేదలు, వైద్యసిబ్బందికి తమ వంతు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీరమ్ సీఈవో తెలిపారు. తొలి 10 కోట్ల డోసుల తర్వాత ఒక్కో డోస్‌కు రూ.300 చొప్పున ప్రభుత్వ సంస్థలకు, రూ.1000 లెక్కన ప్రైవేటు మార్కెట్‌లోకి తీసుకొస్తామన్నారు. దేశ ప్రజలకు, ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా వ్యాక్సిన్ ఒక్కో డోస్‌ను రూ.200కే అందించేందుకు అంగీకరించామని ఆయన చెప్పారు.
కాగా..ఈ ఉదయం (జనవరి 12,2021) పూణె నుంచి వ్యాక్సిన్ లోడ్ తో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని స్పైస్ జెట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ను రవాణా చేసే అవకాశం తమకు లభించడం గర్వకారణమని..సకాలంలో అన్ని నగరాలకూ టీకాను చేర్చే విషయంలో తాము కట్టుబడివున్నామని వెల్లడించింది.
కాగా..టీకా విమానాశ్రయానికి చేరిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడిస్తూ, హర్షం వ్యక్తం చేశాయి. కరోనా మహమ్మారి దేశంలోకి వచ్చిన తొలినాళ్లలో వైద్య పరికరాలను అన్ని ప్రాంతాలకూ చేర్చేందుకు ఎంతో కృషి చేశామని..టీకాను కూడా అన్ని ప్రాంతాలకూ చేరుస్తామని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సీఈఓ తెలిపారు.
తమ విమానాశ్రయంలో రెండు కార్గో టర్మినల్స్ ను ప్రత్యేకంగా మైనస్ 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతను నిర్వహించేలా తయారు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఉన్నంత వరకూ టీకాలను భద్రంగా నిల్వ చేస్తామని అన్నారు. రోజులో 57 లక్షల టీకా డోస్ లను నిల్వ చేసే సామర్థ్యం ఉందని అన్నారు.
ఇదిలావుండగా, అన్ని రాష్ట్రాలకూ టీకాను చేర్చేందుకు పలు లాజిస్టిక్ సంస్థలు, ఎయిర్ లైన్స్ కంపెనీలు, విమానాశ్రయాలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది. ఈ తెల్లవారుజామున మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పూణె ఎయిర్ పోర్టుకు వ్యాక్సిన్ చేరుకోగా, వాటిని వివిధ నగరాలకు తరలించారు.
దీంట్లో భాగంగా కరోనా వ్యాక్సిన హైదరాబాద్ కు చేరుకుంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లను సంబంధిత ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







