ఇండోనేషియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
- January 12, 2021
జకర్తా: ఇండోనేషియా సమీపంలోని జావా నదిలో శ్రీవిజయ ఎయిర్ జెట్‌కు చెందిన విమానం కూలిన ఘటనలో 62 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానానికి చెందిన బ్లాక్ బాక్సును డైవర్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. విమానం కూలిన ప్రాంతంలో వెతికిన డైవర్లు బ్లాక్ బాక్సు దొరికినట్లు సమాచారం. అయితే అది ఫ్లయిట్ డేటా పరికరమా లేక కాక్‌పిట్ వాయిస్ రికార్డరా అన్న విషయం స్పష్టంగా తెలియదు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణాన్ని విశ్లేషించేందుకు బ్లాక్ బాక్సు డేటా కీలకం కానున్నది. శనివారం రోజున జకర్తా నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లో భారీ వర్షంలో విమానం సమీప సముద్రంలో కూలిపోయింది. బాక్ల్ బాక్సు కోసం సుమారు 160 మంది డైవర్లు సముద్రంలో అన్వేషించారు. విమానం కూలిన ప్రాంతంలో సుమారు 3600 మంది రెస్క్యూ సిబ్బంది, 13 హెలికాప్టర్లు, 54 భారీ నౌకలు, 20 చిన్న బోట్లతో గాలింపు చర్యలు సాగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







