యూఏఈ గ్రీన్ లిస్ట్ లో ఖతార్...క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు
- January 12, 2021
ఖతార్ తో స్నేహ పూర్వక వాతావరణం కోరుకుంటున్న యూఏఈ ఇటీవలి కాలంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఖతార్ నుంచి భూ, వాయు, జల సరిహద్దు రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యూఏఈ ఇప్పుడు...ఖతార్ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనల నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది. యూఏఈ రాజధాని అబుధాబి ప్రకటించిన గ్రీన్ లిస్ట్ జాబితాలో ఖతార్ ను కూడా చేర్చింది. దీంతో ఖతార్ నుంచే ప్రయాణికులు ఎవరూ ఇకపై 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే..ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ మాత్రం వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొత్త అప్ డేట్ లిస్ట్ ప్రకారం బ్రూనై, చైనా, హాంగ్ కొంగ, ఇస్లే ఆఫ్ మ్యాన్, కువైట్, మకావో, మౌరిషియస్, మొంగోలియా, కొత్త కాలెడోనియా, న్యూజిలాండ్, ఒమన్, కతార్, సావో టోమ్ మరియు ప్రిన్సిపీ, సౌదీ అరేబియా, స్టట్ కిట్స్- నెవిస్, తైపీ, థాయ్ దేశాల నుంచి వచ్చే వారు క్వారంటైన్ నిబంధనలు వర్తించవు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









