కువైట్:క్లాసులు ఉంటాయ్..పరీక్షలు ఉండవ్

- January 13, 2021 , by Maagulf
కువైట్:క్లాసులు ఉంటాయ్..పరీక్షలు ఉండవ్

కువైట్ సిటీ:ఈ విద్యాసంవత్సరంలో పరీక్షలపై కువైట్ విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో తొలి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించటం లేదని ప్రకటించారు. అయితే..అన్ని క్లాసుల వారికి ఆన్ లైన్ లో క్లాసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని కూడా వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం అంతగా శ్రేయస్కరం కాదనే భావనకు వచ్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే..పేపర్ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్ధులు, పాఠాశాల సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రమాదమని, అదే సమయంలో ఆన్ లైన్ లో కూడా పరీక్ష నిర్వహణపై అధికారుల బృందం నుంచి విముఖత వ్యక్తం అయిందని ఆయన తెలిపారు. అందుకే ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించటం లేదని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com