యూఏఈలో ముమ్మరంగా వ్యాక్సినేషన్..12 లక్షల మందికిపైగా లబ్ధిదారులు
- January 13, 2021
యూఏఈ:కోవిడ్ అరికట్టడంలో ముందు నుంచి పటిష్ట చర్యలు తీసుకుంటున్న యూఏఈ...కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలోనూ అదే స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ కు అనుమతులు రాగానే యుద్ధప్రతిపాదికన వ్యాక్సినేషన్ కార్యాక్రమాన్ని కింగ్డమ్ వ్యాప్తంగా ప్రారంభించింది. ఇప్పటివరకు 12,75,000 మందికి వ్యాక్సిన్ అందించినట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహముద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ను విజయవంతంగా నిర్వహించటంలో నిర్విరామంగా కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రధాని ప్రశంసించారు. సమర్ధవంతంగా, వేగంగా, ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించటంలో యూఏఈ ప్రపంచంలో రెండో దేశంగా నిలిచిందని..ఇదంతా ఫ్రంట్ లైన్ వర్కర్లు, సహాయక సిబ్బంది సాధించిన ఘనత అని ఆయన కొనియాడారు. కింగ్డమ్ పరిధిలోని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత ఉంటుందనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల సమాజ భద్రతకు తమ వంతు పాత్రను పోషించాలని, కోవిడ్ ముప్పు నుంచి బయట పడటం ద్వారా మన లక్ష్యాలు, ఆర్ధిక సమస్యలను అధిగమించే దిశగా ప్రయాణిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష