అమెజాన్ బంపర్ ఆఫర్..

- January 13, 2021 , by Maagulf
అమెజాన్ బంపర్ ఆఫర్..

అమెజాన్ ప్రైమ్ తన వినియోగ దారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎన్నడూ లేని విధంగా కొత్త తరహా ప్లాన్‌ తీసుకురాంది. మొట్టమొదటి సారి సరికొత్తగా మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం కేవలం రూ.89 నుంచి ప్లాన్‌లు మొదలయ్యెలా కొత్త ప్లాన్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌లకు అందుతున్న ఆదరణ అంతాఇంత కాదు. దీంతో అనేక కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. దాంతో ఓటీటీల మధ్య పోటీ కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ సరికొత్త ప్రణాళికతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఓటీటీల్లో అమెజాన్‌కు ప్రత్యర్థిగా ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ను ఎదుర్కొనేందుకు అమెజాన్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. నెట్ ఫ్లిక్స్ తన మొబైల్ ప్లాన్‌ను రూ.199 ధరతో నెల రోజులకు విడుదల చేసిన తర్వాత అమెజాన్ తన రూ.89 ప్లాన్ రిలీజ్ చేయడంతో వీటి మధ్య పోటీ ఎంతలా ఉందో అర్థం అవుతోంది. అయితే ఎలాగైనా నెట్‌ఫ్లిక్స్‌ను వెనక్కునెట్టి ఓటీటీల్లో ప్రథమ స్థానం సంపాదించాలనే అమెజాన్ ఇలా చేస్తుందా అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వినియోగదారులకు అత్యంత తక్కువకే క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ఈ ప్రణాళికను ముందుకు తెస్తుందా అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైతేనేం వినియోగదారులకు అతి తక్కువ ధరకే నెల రోజుల యాక్సిస్‌ను ఇవ్వడానికి అమెజాన్ ముందుకు వస్తుంది. దీనిక సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com