కువైట్: 300,000కి పైగా రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్

కువైట్: 300,000కి పైగా రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్

కువైట్ సిటీ:కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత ఇప్పటివరకు వలసదారులకు చెందిన 300,000 రెసిడెన్సీ పర్మిట్స్ రెన్యువల్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్ విధానం ద్వరా ఈ రెన్యువల్స్ జరిగాయి. కువైట్‌కి తిరిగి వచ్చేందుకోసం విదేశాల్లో చిక్కుకుపోయినవారు ఆన్‌లైన్‌లో తమ రెసిడెన్సీ పర్మిట్స్‌ను రెన్యువల్ చేయించుకున్నారు. ఆరు నెలలకు పైగా కువైట్‌లో లేకుండా విదేశాల్లో వుండిపోయినవారికి రెన్యువల్ అవకాశం లేదనే నిబంధనను తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. మరోపక్క, పిఏఎం 34,414 వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. విదేశాల్లో వుండిపోయి, రెన్యువల్ చేసుకోనివారికి సంబంధించి ఈ రద్దు జరిగింది. 44,264 మంది డ్రైవర్ లైసెన్సులను కూడా రద్దు చేశారు.

Back to Top