ఖిలాడి కొత్త పోస్టర్ విడుదల
- January 13, 2021హైదరాబాద్:మాస్ మహరాజ్ రవితేజ తాజాగా క్రాక్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తన విజయాత్ర కొనసాగిస్తుందడగానే రవితేజ తన తదుపరి చిత్రం నుంచి సరికొత్త అప్డేట్ తీసుకొచ్చాడు. రవితేజ నూతనంగా చేస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే దీని నుంచి నేడు మరో పోస్టర్ విడుదలైంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగుతోంది. ఈ సినిమా రమేష్ వర్మ దర్వకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో మాస్ మహరాజ్ సరసన మీనాక్షి చౌదరీ నటిస్తోంది. దీనిని రమేష్ వర్మ యాక్షన్ ఎంటర్టైర్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఖలాడీ టీం సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో రవితేజ, మీనాక్షి, డింపుల్ హయాతి ముగ్గురు కనిపించారు. ఈ చిత్రం ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇందులో రవితేజ లుక్స్ ఎలా ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బారీ హిట్ కావడంతో రవితేజ తదుపరి చిత్రం ఖాలాడీ పై కూడా అంచనాలు తారాస్థాయిని మించిపోయాయి. మరి ఈ సినిమాతో మరోసారి రవితేజ అభమానులను ఆకట్టుకుంటుందేమో వేచి చూడాలి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు