తెలంగాణలో కరోనా కేసుల వివరాలు...
- January 15, 2021_1610687828.jpg)
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గాయి.. నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి రోజువారి కేసులు.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు మృతిచెందారు. ఇదే సమయంలో 253 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,118కు పెరగగా.. ఇప్పటి వరకు 2,85,102 మంది రికవరీ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,574 మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల శాతం దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉందని.. రికవరీ రేటు భారత్‌లో 96.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో 97.93 శాతానికి పెరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,442 యాక్టివ్ కేసులు ఉండగా... 2,541 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.. ఇక, గురువారం రోజు రాష్ట్రంలో 19,898 కరోనా శాంపిల్స్ మాత్రమే పరిక్షించారు.. దీంతో.. ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 73,99,436కు చేరుకుంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..