ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రిపోర్ట్స్‌

- February 23, 2016 , by Maagulf
ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రిపోర్ట్స్‌

దుబాయ్‌ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రిపోర్ట్స్‌ 2018 నాటికి అందుబాటులోకి రానున్నాయి. క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ దుబాయ్‌ మరియు చైర్మన్‌ ఆఫ్‌ దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ షేక్‌ హవదాన్‌ బిన్‌ మొహమ్మద్‌, దుబాయ్‌ స్మార్టర్‌ - దుబాయ్‌ హెల్తీయర్‌ అనే ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. సలామా మరియు నబిద్‌ అనే రెండు ఎలక్ట్రానిక్‌ ప్రాజెక్టులు దుబాయ్‌ని సిటీ ఆఫ్‌ ది ఫ్యూచర్‌గా మార్చేస్తాయని దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో నేషనల్‌ యునిఫైడ్‌ మెడికల్‌ రికార్డ్‌తో మమేకమవుతాయి. పేషెంట్‌కి సంబంధించిన సమగ్ర సమాచారం ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌ రూపంలో భద్రపరచడం సలామా ప్రాజెక్టు ఉద్దేశ్యం. 34 ఆసుపత్రులు మరియ, 2270 హెల్త్‌ సెంటర్స్‌ నబిద్‌ ప్రాజెక్టులో భాగమవుతాయి. పేషెంట్‌, డాక్టర్‌ దగ్గరకు వెళ్ళినప్పుడు చిటెకెలో ఆ పేషెంట్‌కి సంబంధించిన మొత్తం సమాచారం డాక్టర్‌కు అందుబాటులో ఉండేలా చేయడం ఈ మొత్తం ప్రాజెక్టులో భాగం. ఇలా చేయడం ద్వారా పేషెంట్‌కి మెరుగైన వైద్యం, తక్కువ సమయంలో అందించడానికి వీలవుతుంది. అలర్జీ హెచ్చరికలు, వాటితోపాటుగా ముందస్తు ప్రమాద హెచ్చరికలు ఈ మెడికల్‌ రికార్డ్స్‌ ద్వారా చేయవచ్చని నిపుణులు వెల్లడించారు. అలాగే, 24 గంటల ఎమర్జన్సీ మెడికల్‌ సర్వీస్‌, అత్యవసర సమయాల్లో మెడికల్‌ రికార్డ్స్‌ ప్రకారం వైద్యం చేయడం, అవసరమైనవారికి రక్తం అందించడం.. ఇవన్నీ ఈ కొత్త విధానం ద్వారా ఎంతో సులువు కానున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com