వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్
- January 15, 2021
కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండదని కువైట్ ప్రకటించింది. విదేశాల నుంచి కువైట్ వచ్చే వారు...విదేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించినా..దాన్ని తాము పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో కొందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని, అందుకే క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ ల నుంచి మినహాయింపు ఇవ్వటం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే..కువైట్ లో నే వ్యాక్సిన్ తీసుకొని వేరే దేశాలకు వెళ్లి..మళ్లీ తిరిగి వచ్చే వారికి మాత్రం క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని కూడా వెల్లడించింది. అయితే..దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా కువైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







