పర్యాటకుడి దగ్గర 2కేజీల మత్తు పదార్ధాలు...దుబాయ్ ఎయిర్ పోర్టులో పట్టివేత
- January 15, 2021
దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ విజిటర్ నిషేధిత మత్తు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 26 ఏళ్ల పాకిస్తానీ తనతో పాటు తెచ్చిన పండ్ల బాక్స్ లో మత్తుపదార్ధాలను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. పండ్ల బాక్సు సైడ్ వాల్స్ సాధారణంగా ఎక్కువ మందంగా ఉండటంతో తమకు అనుమానం వచ్చిందని వివరించారు. బాక్సును పరిశీలించటంతో నిషేధిత మత్తు పదార్ధాలు బయట పడ్డాయని తెలిపారు. చట్ట విరుద్ధమైన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై నిందితుడ్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల