ఖతార్ లో మాస్కులు ధరించని 171 మందిపై లీగల్ యాక్షన్
- January 15, 2021
కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటున్నా...కొందరు వ్యక్తులు మాత్రం అవేం పట్టించుకోకుండా కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు ధరించకపోవటం, వాహనాల్లో పరిమితి మించి ప్రయాణించటం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతుననట్లు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరిగుతున్న 171 మందిపై కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 5,811 మందిపై మాస్కు నిబంధన ఉల్లంఘన కేసులు నమోదైనట్లు తెలిపింది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించిన ఘటనలకు సంబంధించి 277 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మసలుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తోటివారి ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల