కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 16, 2021
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. అయితే... వ్యాక్సిన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని.. వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు మోదీ. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు వ్యాక్సిన్లు వచ్చాయని... మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. తక్కువ సమయంలోనే మనకు టీకా వచ్చిందని తెలిపారు. అంతేకాదు.. వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని స్పష్టం చేశారు మోదీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







