సౌదీ అరేబియాలో మహిళా జడ్జిల నియామకం
- January 16, 2021రియాద్:సౌదీ అరేబియా త్వరలోనే మహిళా జడ్జిల నియామకం చేపట్టనుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ - విమెన్ ఎంపవర్మెంట్ అండర్ సెక్రెటరీ హింద్ అల్ జాహిద్ ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాలిద్ అల్ సమాని, ఇటీవలే 100 మంది విమెన్ నోటరీల నియామకానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే పలువురు మహిళల్ని లా, షరియా, సోషియాలజీ, అడ్మినిస్ట్రేషన్ మరియు టెక్నాలజీ వంటి విభాగాల్లో నియమించడం జరిగింది. 2025 నాటికి 25 శాతం మంది మహిళలకు సౌదీ లేబర్ మార్కెట్లో అవకాశాలు కల్పించాలనే లక్షం పెట్టుకోగా, ఇప్పటికే 31 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇతర విభాగాలతో పోల్చితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో మహిళల నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయని అల్ జాహిద్ చెప్పారు. లేబర్ మార్కెట్లో పురుషులతో సమాన అవకాశాలు మహిళలకు దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్