యువతకు ఉద్యోగాలు
- February 23, 2016
ప్రైవేటు రంగంలో బహ్రెయినీ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు క్యాబినెట్ కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశం, 15,000 మంది బహ్రెయినీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఓ ప్రాజెక్టును ప్రారంభించాలని సంకల్పించింది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ మిసరయు డిప్లొమా హోల్డర్స్ అలాగే, జనరల్ సర్టిఫికేట్స్ ఫర్ సెకెండరీ ఎడ్యుకేషన్ యువతకు ఈ ఉద్యోగావకాశాల్ని కల్పించనున్నారు. 2014లో ప్రారంభించిన పథకానికి కొనసాగింపు ఇది. అప్పట్లో 10,000 మంది బహ్రెయినీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని తీర్మానించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ప్రిన్స్ ఖలీఫా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరికొన్ని ముఖ్యమైన అంశాల్ని క్యాబినెట్ చర్చించగా, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







