సౌదీ అరేబియాలో 150కి దిగువలో నమోదవుతున్న వైరస్ కేసులు
- January 17, 2021రియాద్:కరోనా వైరస్ వ్యాప్తిలో సౌదీ ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలు కొద్ది మేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో 140 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్నాళ్లుగా 150 లోపే పాజిటివ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. కొత్త నమోదైన కేసులతో కలుపుకొని కింగ్డమ్ పరిధిలో ఇప్పటివరకు 3,64,753 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 1,894 యాక్టీవ్ కేసులు ఉండగా...అందులో 321 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో పోలిస్తే..రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 159 మంది రికవరి అయ్యారని, మొత్తంగా ఇప్పటివరకు 3,56,541 మంది కోవిడ్ నుంచి రికవరి అయినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..కోవిడ్ కారణంగా మరో ఐదు మంది మృతి చెందారు. దీంతో కింగ్డమ్ పరిధిలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 6,318 మందికి పెరిగింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్