దుబాయ్ లో వ్యాక్సిన్ వేయించుకున్న అనుభవం
- January 17, 2021
దుబాయ్: కరోనా కి ఒకవైపు ప్రపంచం అతలాకుతలం అయిపోతుంటే వీటిలో వెరియేషన్లు అని మరోవైపు మరింత తీవ్రంగా దాడి చేస్తోంది కరోనా మహమ్మారి. దీంతో ప్రపంచదేశాలు ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోవడంపై దృష్టి సారించాయి. యూఏఈ లో చైనా కు చెందిన 'సినోఫార్మ్' మరియు అమెరికా కు చెందిన 'ఫైజర్' ను అందిస్తున్నారు. అయితే, మనలో చాలామందికి ఈ వ్యాక్సిన్ లు తీసుకోవచ్చా? తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో అనే పలు సందేహాలు ఉన్నమాట వాస్తవమే!
దుబాయ్ లో నివసిస్తున్న తెలుగు వారు ఒకరు (పేరు చెప్పబడదు) వ్యాక్సిన్ తీసుకున్న తమ అనుభవాన్ని అందరితో ఇలా పంచుకున్నారు..
"కోవిడ్ వ్యాక్సిన్ డిసెంబర్ ఆఖరి వారంలో వచ్చేసినా మొదట అందరి లాగే మాకు కూడా సంశయం ఉండేది తీసుకుంటే మంచిదా కాదా అని. మాకు తెలిసిన డాక్టర్ల అభిప్రాయం తెలిసాక ఆరోగ్య శాఖ కు కాల్ చేసి రెజిస్ట్రేషన్ చేయించుకుని నేను మావారు వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాము. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే consent formకి లింక్ ఇస్తారు. అందులో చదివిన వివరాలు మాకు సంతృప్తికరంగా అనిపించి మేము అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసాము.
వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్లో పద్ధతి ప్రకారం లోపలకి పంపి, మా బీపి చెక్ చేసి, మందులు తీసుకోలసిన అనారోగ్యాలు కాని ఎలర్జీలు కాని ఉన్నాయా, ఈ మధ్య ఏమైన జ్వరాలు, వైద్యాలు, వేరే టీకాలు ఏమైనా అయ్యాయా అని కనుక్కుని, రిస్క్ లేదు అని నిర్ధారించుకున్నాకే ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, చిన్న సలపరం జ్వరం లాంటివి రావచ్చు అని, దానికి పానాడోల్ వేసుకుంటే చాలు అని చెప్పారు.
సూది చాలా సన్నంగా ఉండటంతో ఇంజెక్షన్ నొప్పి అన్నదే తెలియలేదు. ఆ తరువాత ఏమైనా ఇమ్మిడియట్ రియాక్షన్లు ఉంటే వైద్య సదుపాయం ఉండటం కోసం ఒక 20 నిమిషాలు అక్కడే వేచి ఉండమని చెప్పారు. అటువంటివి ఏవి మాకు అవలేదు. అప్పుడు రెండో డోస్ కి మూడు వారాల తరువాత తేదికి అపాయింట్మెంట్ ఇచ్చి పంపించేసారు.
మేము ఇంటికొచ్చాక 1000 mg పానాడోల్ వేసుకున్నాము. చేయి నొప్పి కూడా లేకుండా బానే ఉన్నాము."
కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా మీరు కూడా త్వరగా వ్యాక్సిన్ వేయించుకొని కరోనా నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..