సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- January 17, 2021
న్యూఢిల్లీ: కొవిడ్-19 విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటికే 50దేశాలకు వ్యాప్తి చెందినట్టు ఓ ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సింగపూర్ చేరుకోగానే తప్పనిసరిగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 25 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని ఉండి, నెగెటివ్ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే సింగపూర్ ప్రభుత్వం ఇప్పటి వరకు తమ దేశంలోకి అనుమతిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఈ నిబంధనను విదేశీ పౌరులకు, కొవిడ్ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో పర్యటించినట్టు ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికే పరిమితం చేసింది. అయితే ఈనెల 25 నుంచి అమలులోకి రాబోతున్న ఆదేశాలు మాత్రం విదేశీ పౌరులతోపాటు స్వదేశీయులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







