'నవభారత్ బహ్రెయిన్' కొత్త కార్యవర్గం ఏర్పాటు

- January 18, 2021 , by Maagulf
\'నవభారత్ బహ్రెయిన్\' కొత్త కార్యవర్గం ఏర్పాటు

బహ్రెయిన్: వేరే దేశాలకు వలస వెళ్ళినప్పుడు అక్కడ అనుకోని ఆపదో/కష్టమో వస్తే అండగా ఉండేందుకు ముందుకు వచ్చే భారత సంఘాలు ఒక అడుగు ముందుకేసి ఆదుకోవటం మనం చూస్తూనే ఉంటాం. బహ్రెయిన్ లోని 'నవభారత్ బహ్రెయిన్' ఇందుకు మరో నిదర్శనం.

బహ్రెయిన్ లో నివసిస్తున్న భారతీయులందరిని ఒక్క తాటి పైకి తీసుకువచ్చి, వారికి ఒక వేదిక ఏర్పరిచి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపై పట్టు సాధించే విధంగా ప్రవాసీయులను ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు వారికి రామాయణము మరియు మహాభారతం నేర్పించటం అందరి మన్నలను పొందుతోంది బహ్రెయిన్ లోని భారత సాంస్కృతిక సంస్థ నవ్ భారత్. ఇవే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ అందరికి అండగా నిలుస్తోంది నవభారత్ బహ్రెయిన్. ఈ కొవిడ్-19 పాండమిక్ సమయంలో చాలా మంది కార్మికులకు రేషన్ కిట్స్ ఇవ్వటం వారికి అవసరమైన సామాగ్రిని సమకూర్చటం జరిగింది. 

2021 జనవరి 14 న మకరసంక్రాంతి శుభ దినోత్సవం సందర్భంగా 'నవభారత్ బహ్రెయిన్' 2021 నుండి 2022 కాలానికి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీని నియమించింది. దీనికి అధ్యక్షులుగా ప్రదీప్ లక్ష్మి పాథీ, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా జి.ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పవిత్రన్ జీ, సభ్యత్వ కార్యదర్శిగా అసార్, కోశాధికారిగా శ్రీశ్రేయస్ జి. నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు ప్రవాసీయులు.

---రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com