3 నెలల్లో దేశం విడిచి వెళ్ళిన 83,000 మంది వలసదారులు
- January 18, 2021
కువైట్: 2020 మూడో త్రైమాసికానికి సంబంధించి వెలుగు చూసిన తాజా గణాంకాల ప్రకారం మొత్తం 83,574 మంది వలసదారులు దేశం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలివి. దీంతో, లేబర్ మార్కెట్‌లో ప్రస్తుతం వర్క్ ఫోర్స్ 1.5 మిలియన్లకు తగ్గింది. ప్రభుత్వ ఏజెన్సీల్లో 29 శాతం మంది కంటే తక్కువ వలసదారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 65 శాతం మంది ఎడ్యకేషన్ హెల్త్ తదితర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. కాగా, బిజినెస్ సెక్టార్‌లో కువైటీల సంఖ్య 4,248కి పెరిగింది. డొమెస్టిక్ వర్కర్స్ విభాగంలో తగ్గుదల గణనీయంగా కనిపించింది. మొత్తం 7385 మంది డొమెస్టిక్ వర్కర్స్ తగ్గారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్పాస్లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







