’18 పేజెస్’ కీలక షెడ్యూల్ ప్రారంభం...
- January 18, 2021
హైదరాబాద్:శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరో నిఖిల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన కార్తికేయ, అర్జున్ సురవరం లాంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా నిఖిల్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల ఆధ్వర్యంలో ’18 పేజెస్’ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమా కీలక షెడ్యూల్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో వేసిన సెట్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ మెమరీ లాస్ కంటే కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా థీమ్ కూడా డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







