దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్‌..!!

- January 08, 2026 , by Maagulf
దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్‌..!!

దుబాయ్: రిటైలర్లు స్పిన్నీస్ మరియు వెయిట్రోస్ పార్కిన్‌తో జతకట్టాయి. తమ స్టోర్ల పార్కింగ్ ప్రదేశాలలో పార్కిన్‌ భాగస్వామ్యంతో పెయిడ్ పార్కింగ్ సౌకర్యాలను ప్రారంభించనున్నాయి. రద్దీని తగ్గించడానికి మరియు కస్టమర్లకు పార్కింగ్ సదుపాయాన్ని మెరుగు పరచడానికి పార్కిన్ తో ఒప్పందం చేసుకున్నట్టు స్పిన్నీస్, వెయిట్రోస్ ప్రకటించాయి. కస్టమర్లకు రెండు గంటల ఉచిత పార్కింగ్ లభిస్తుందని, ఆ తర్వాత రుసుములను వసూలు చేస్తారని తెలిపారు.

ట్రేడ్ సెంటర్ రోడ్, కరామా, మోటార్ సిటీ, అల్ మైదాన్ మరియు ఉమ్ సుకీమ్‌లోని స్పిన్నీస్ బ్రాంచ్‌లకు ఈ టారిఫ్ వర్తిస్తుంది. మోటార్ సిటీ మరియు అల్ థాన్యాలోని వెయిట్రోస్ బ్రాంచ్‌లు పెయిడ్ పార్కింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.  ఈ ఆరు ప్రదేశాలు ఆటోమేటెడ్ యాక్సెస్ కంట్రోల్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ సొల్యూషన్స్‌తో సహా పార్కిన్ ఆధునిక పార్కింగ్ నిర్వహణ సాంకేతికతను కలిగి ఉంటాయి. ఈ ప్రదేశాలు కంపెనీ మొబైల్ యాప్‌తో కనెక్ట్ అయి ఉంటాయని, కస్టమర్‌లు వారి మొబైల్ ద్వారా నేరుగా చెల్లించవచ్చని స్పిన్నీస్ CEO సునీల్ కుమార్ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com