డా.దాశరధి పాటకు పట్టాభిషేక మహోత్సవం...

- January 18, 2021 , by Maagulf
డా.దాశరధి పాటకు పట్టాభిషేక మహోత్సవం...

అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో, ఆరవ ప్రపంచ వంశీ సంగీత సాహిత్య సమ్మేళనంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా సహకారంతో వంశీ ఇంటర్నేషనల్ అమెరికా-ఇండియా, యునైటెడ్ కింగ్ డం  తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్మణాచార్య మెమోరియల్ కాలేజీ అఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకురాలు శశికళాస్వామి, హిమబిందు ప్రపంచ వ్యాప్తంగా వున్నా వారి 85  మంది శిష్యులతో ప్రముఖ సినీ గేయ రచయిత దాశరధి రచించిన పాటల నుంచి 100  ఆణిముత్యాల్లాంటి పాటలను ఎన్నుకొని అంతర్జాలంలో పదిహేడో తేదీ ఉదయం 11  గంటలనుంచి రాత్రి 11  గంటలవరకు దాశరధి పాటకు పట్టాభిషేకం  అనే సంగీత మహోత్సవాన్ని అత్యద్భుతంగా   చేసి ఎందరో ప్రశంసలను పొందారు. 


ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధి గా వచ్చిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికిష్ణ ప్రసంగిస్తూ డా దాశరధి ప్రతి పాట ఆణిముత్యమని నిరంతర చైతన్య మూర్తి అని అంతే కాకుండా సినీ రసవత్  గీతాకారుడని ప్రస్తుతించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ దాశరధి ఆకారం వామనుడు కానీ వాక్య పరంగా విశ్వంభరుడు , తిమిరంతో సమరం...మానవుడు మనిషిగా ఎదగాలంటే చీకటిలో పోరాడాలి. మనలోని హరిషడ్వార్గాలను తిమిరంగా భావించి పోరాడాలి .... చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో " నలుగురు చూసిందే చూసి ఎవరూ చెప్పలేనివి చెప్పగలిగే వాడే కవి. ఆయన చుసిన కోణం వేరు. నా తెలంగాణా కోటి రతనాల వీణ అంటూ ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన మహాకవి దాశరధి అన్నారు. తెలుగు ఉర్దూ భాషలను కలిపి చక్కని భాషలను అందించారు ఆయన అక్షరాలతో పెయింటింగ్ వేశారు. ఉర్దూ భాష సొబగు తెలుగుకు పరిచయం చేశారు. తన పోరాట పటిమను నిరూపించుకున్నారు. గొప్ప నేపధ్యం ఉద్యమ చైతన్యం వున్న వ్యక్తి దాశరధి.

తెలుగు భాష ఉన్నంత వరకు దాశరధి మన మదిలో చిరస్థాయిగా నిలిచివుంటారు. తెలుగు చిత్ర సీమ లో పాటకు ఊపిరి నిచ్చింది దాశరధి. ఏ దివిలో విరిసిన పారిజాతమో పాటలో  ప్రతి యువకుడి గుండె చప్పుడు వినిపిస్తుంది.  ప్రేయసి ప్రియుల అనుబంధాన్ని తెలిపే పాట ఎన్నెన్నోజన్మల  బంధం పాట స్త్రీ పురుష అనుబంధాలను తెలియజేసే ఎన్నో పాటలు రాసారు. మనసును కోవెల చేసుకొని మానవత్వాన్ని మేలుకొలిపారు. నడిరేయి ఏ ఝాములో అంటూ ఇతర ఆధ్యాత్మిక పాటలకు  ధీటుగా తరతరాలకు నిలిచి పోయే పాటలు రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సాహిత్యానికి సమాజానికి ఆయన చేసిన మేలు మరువలేనిది. 
తెలంగాణ  రాష్ట్రము ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి KCR పదవి లోకి రాగానే దాశరధి పేరు మీద ఆయన పుట్టిన రోజు జులై 22  తేదీన సాహితీ మూర్తులకు తెలంగాణా ప్రభుత్వం  తరపున పురస్కారాలు  ఇచ్చి గౌరవించడం మొదలు పెట్టింది. 


ఈ కరోనా సమయంలో సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకుంటూ డిజిటల్ ఫ్లాట్ ఫహారం  మీద కూడా అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఐదు దశాబ్దాల వంశీ సంస్థను అభినందించారు.


అంతే కాకుండా సంగీత సాహిత్య నృత్య సేవను నాలుగు స్తంభాలుగా చేసికొని వంశీ సంస్థ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రపంచ దేశాలలోని తెలుగువారిని ఏకం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని ప్రశంసించారు.
ఎక్కడో అమెరికాలో ఉంటూ  సమకాలీన వ్యక్తుల గురించి విశేషంగా పరిచయం చేయడం సమకాలీన విషయాలను అవగాహన చేసుకోవడం, పాటే తన ప్రాణం గా భావించి దాశరధి పాటకు పట్టాభిషేకం మహోత్సవం లో ప్రధాన పాత్ర వహించిన  శారద ఆకునూరి ని ఆయన ప్రశంసిస్తూ ఆవిడ గాయని గానే కాకుండా, 2020  ఫిబ్రవరి లో రవీంద్రభారతి లో దాశరధి పాటల పండుగను నిర్వహించి  వారు రచించిన పాటల లోనుండి 350  పాటలను "మదిలో వీణలు మ్రోగే" గ్రంధాన్ని ప్రచురించడం  ఘన నివాళిగా భావిస్తున్నాను అని అన్నారు. 
ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ దాశరధి కాలాతీత రచయిత గా కీర్తిస్తూ ఆయన రచించిన దాశరధి పాటకు పట్టాభిషేకం చేయటం సినీ గేయ రచయితలకు  ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి  దాశరధి కుటుంబ సభ్యులు లక్ష్మణ్ దాశరధి, ఇందిరా దాశరధి, గౌరీ శంకర్ జ్యోతి ప్రకాశం చేశారు.US   నుండి దాశరధి మేనకోడలు దుర్గ డింగరి  ఆయనతో తనకున్న కుటుంబ నేపధ్యాన్ని తెలియజేసారు. 


ప్రజా నటి ,  కళాభారతి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జమునా రమణారావు మాట్లాడుతూ దాశరధి రచించిన పలు గీతాలకు అనేక చిత్రాలలో నటించినప్పుడు  ఆయన సాహిత్య విలువలు తననెంతో ఉత్తేజ పరిచాయని అంటూ "గోదారి గట్టుంది, మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే ,  ఏ శుభసమయంలో , ఈ వేళ నాలో ఎందుకో ఆశలు " వంటి ఎన్నో పాటలు జ్ఞాపకం చేసుకున్నారు.UKTA ట్రస్టీ డా.VP కిల్లి వంశీ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు  12  గంటల ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి జయప్రదం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com