గృహ కార్మికుడి నియామక ఖర్చు KD990 గా కువైట్ నిర్ణయం
- January 19, 2021
కువైట్: గృహ కార్మికుల రిక్రూట్మెంట్ కు సంబంధించి నియామక ఖర్చులను కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అధికార విభాగం ఖరారు చేశాయి. విదేశాల నుంచి గృహ కార్మికుడ్ని తీసుకొచ్చే ఆఫీసుల ద్వారా రిక్రూట్మెంట్ జరిగితే..ఆ నియామక ఖర్చును 990 కువైట్ దినార్స్ గా నిర్ణయించారు. అలాగే కువైట్లోని డొమస్టిక్ వర్కర్లే నేరుగా యజమానులను సంప్రదించినట్లైతే రిక్రూట్మెంట్ కాస్ట్ ను 390 కువైట్ దినార్లుగా నిర్ణయించారు. అయితే...ఈ రిక్రూట్మెంట్లలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. గృహ కార్మికుడు ఒక యజమాని దగ్గర కనీసం ఆరు నెలలైన పని చేయాలి. ఈ మేరకు ముందే అగ్రిమెంట్ రాసివ్వాలి. ఒక వేళ ఒప్పంద ఉల్లంఘన జరిగితే..మరో కార్మికుడ్ని నియమించుకునేందుకు వీలుగా సదరు యజమానికి నష్టపరిహారం చెల్లించాలసి ఉంటుంది. పౌరులు, ప్రవాసీయులపై ఆర్ధిక భారం తగ్గించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తే వెంటనే వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హాట్ లైన్ నెంబర్ 135కి కాల్ చేయాలని, లేదంటే [email protected] కి మెయిల్ చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







