సౌదీలో అందుబాటులోకి ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లు
- January 19, 2021సౌదీ: కోవిడ్ 19కి విరుగుడుగా దేశ ప్రజల కోసం మరో రెండు వ్యాక్సిన్లను సౌదీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ను అందిస్తున్న సౌదీ ప్రభుత్వం..దానికి అదనంగా ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. అస్ట్రాజెనెకా, మెడెర్నా వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రకటించిన ఆరోగ్య శాఖ...ఇక నుంచి సౌదీ ప్రజలు కోవిడ్ కు విరుగుడుగా కొత్త వ్యాక్సిన్లను కూడా ఎంచుకోవచ్చని వెల్లడించింది. ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ తో పోలిస్తే..ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను తేలికగా రవాణా చేయవచ్చని అలాగే వాటిని భద్రపరచటం కూడా తేలికని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..