సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
- January 19, 2021
హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పేదలకు సాయపడి అందరి మన్ననలు పొందిన సినీనటుడు సోనూసూద్ అప్పటి నుంచి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన నుంచి సాయం పొందిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చాలా మంది ఉన్నారు. ట్విట్టర్ వేదికగా సాయం కోరిన వారికి ఆయన అభయమిస్తూ పేదల కష్టాలను తీరుస్తున్న సోనూసూద్ ఇప్పుడు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు.
ఇటీవల కొన్ని వ్యాన్లను కొనుగోలు చేసిన సోనూసూద్ వాటిని అంబులెన్సులుగా మార్పించి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం వాటిని ప్రారంభించారు. వైద్య సాయం కావాల్సిన పేదలకు ఈ సేవలు అందుతాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఈ అంబులెన్సులు సోనూసూద్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ అంబులెన్స్ సర్వీస్‌ను నటుడు సోనూ సూద్ స్వయంగా మంగళవారం ట్యాంక్ బండ్‌పై ప్రారంభించారు. దాతల సహాయంతో ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును ఈ అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు