పీసీఆర్ టెస్ట్ సెంటర్లను తగ్గించిన దుబాయ్ హెల్త్ అథారిటీ

- January 20, 2021 , by Maagulf
పీసీఆర్ టెస్ట్ సెంటర్లను తగ్గించిన దుబాయ్ హెల్త్ అథారిటీ

దుబాయ్:కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం, గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి కొద్దిగా ఆశాజనకంగా మారటంతో దుబాయ్ హెల్త్ అథారిటీ పీసీఆర్ టెస్ట్ సెంటర్ల కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. మాల్స్ తో పాటు కొన్ని కీలక కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పీసీఆర్ టెస్ట్ సెంటర్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే..ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తామని, టెస్ట్ చేయించుకోవాలని అనుకునేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాలని తెలిపింది. అలాగే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా పరీక్షలు చేయించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ కొన్ని టెస్ట్ కేంద్రాలను కంటిన్యూ చేస్తున్నామని వెల్లడించింది. అల్ రషీదియా మజ్లిస్, జుమ్మెరా 1 పోర్ట్, అల్ నాస్ర్ క్లబ్ లోని పీసీఆర్ పరీక్షా కేంద్రాలలో అపాయింట్మెంట్ ప్రతిపాదికన టెస్టులు చేయనున్నారు. అలాగే డైరా సిటీ సెంటర్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మాత్రం నేరుగా వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com