అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేసిన దుబాయ్

అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేసిన దుబాయ్

దుబాయ్:అత్యవసరం కాని సర్జరీలను నెల రోజులపాటు సస్పెండ్ చేస్తూ దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆసుపత్రులు, వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జనవరి 21 నుంచి నెల రోజులపాటు అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేయాల్సిందిగా సర్క్యలర్ జారీ చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న ప్రొసిడ్యూర్స్... డీప్ సెడేషన్ అవసరం లేనివి, హాస్పిటలైజేషన్ అవసరం లేనివి, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యుజన్స్ అవసరం లేనివాటికి ఈ సస్పెన్షన్ నుంచి మినహాయింపునిచ్చారు.

Back to Top