దుబాయ్ రెస్టారెంట్లు, కేఫ్ లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలుకు కొత్త రూల్స్
- January 23, 2021
దుబాయ్:రెస్టారెంట్లు, కేఫ్ లలో అమలు చేస్తున్న భౌతిక దూరం నిబంధనలను స్వల్పంగా సవరించింది దుబాయ్ సుప్రీం కమిటీ. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..ఇకపై రెస్టారెంట్లు, కేఫ్ లలో మరింత దూరం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రెండు టేబుళ్ల మధ్య రెండు మీటర్లు ఉంటే సరిపోయేది. సుప్రీం కమిటీ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ప్రకారం ఇక నుంచి టేబుల్ కి టేబుల్ కి మధ్య మూడు మీటర్ల దూరాన్ని మేయిన్‌టేన్ చేయాలి. అలాగే ఒక్కో టేబుల్ మీద గరిష్టంగా అనుమతించే వినియోగదారుల సంఖ్యను కూడా కుదించారు. రెస్టారెంట్లలో అయితే ఒక్కో టేబుల్ పై గతంలో పది మందికి అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు ఏడుగురికి మించి అనుమతించరాదు. ఇక కేఫ్ లలో ఒక్కో టేబుల్ పై గరిష్టంగా నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, కేఫ్ లలో వినియోగదారుల సంఖ్యను కుదించటం...తద్వారా భౌతిక దూరం నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు అనువుగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







