రియాద్ పై దాడికి విఫలయత్నం...సమర్ధవంతంగా తిప్పికొట్టిన సౌదీ

రియాద్ పై దాడికి విఫలయత్నం...సమర్ధవంతంగా తిప్పికొట్టిన సౌదీ

సౌదీ అరేబియా రాజధాని రియాద్ పై వాయు దాడికి విఫలయత్నం జరిగింది. ఆకాశం నుంచి రియాద్ వైపుగా దూసుకొచ్చిన మిస్సైళ్లను సౌదీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొని విధ్వంసం చేయటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే..దాడి లక్ష్యం ఏంటి..? దాడికి ఎవరు కుట్ర చేశారు? అనేది మాత్రం సౌదీ ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ఆకాశంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో గుర్తు తెలియని వస్తువు తెల్లని పొగ ఎగచిమ్ముతూ రియాద్ వైపు దూసుకురావటం తాము గమనించామని, ఆ సమయంలో తమ ఇళ్లు షేక్ అయిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా రియాద్ ను లక్ష్యంగా చేసుకొని పలు మార్లు దాడి ప్రయత్నాలకు పాల్పడిన విషయం తెలిసిందే. పొరుగు దేశమైన యెమన్ లో జరుగుతున్న సివిల్ వార్ లో యెమన్ ప్రభుత్వానికి సౌదీ నేతృత్వంలోని సంయుక్త దేశాలు మద్దతు ఇస్తూ వస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న హౌతి అతివాద సంస్థ ఇప్పటికే పలుమార్లు సౌదీని లక్ష్యంగా చేసుకొని దాడి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత దాడి యత్నం కూడా యెమన్ హౌతి పనే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా..అందుకు ఆధారాలు మాత్రం లేవు. ఇదిలాఉంటే..దాడి ప్రయత్నం నేపథ్యంలో సౌదీ అరేబియాలో తమ దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక విడుదల చేసింది. అయితే.. అధునాతన ఆయుధాలు అందిస్తూ ఇరాన్..హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలబడుతోందన్నది పాశ్చత్య దేశాల నిపుణులు, సౌదీ అరేబియా, అమెరికా వాదిస్తోంది. కానీ, ఇరాన్ మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తూ వస్తోంది.

 

Back to Top