త్వరలో నూతన ఐటీ పాలసీ:మంత్రి కేటీఆర్

త్వరలో నూతన ఐటీ పాలసీ:మంత్రి కేటీఆర్

హైదరాబాద్:ఐటి పాలసీ కి ఐదు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్ త్వరలో నూతన ఐటీ పాలసీని తీసుకువస్తామని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉపాధి అవకాశాలు లక్ష్యంగా నూతన ఐటీ పాలసీ తీసుకువస్తున్నామన్న ఆయన తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలను అందించిందని అన్నారు. ప్రజలకు మరిన్ని ప్రభుత్వ సేవలు పొందే విధంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ విభాగం బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. పౌరుడి సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా మరిన్ని ఆన్లైన్, మొబైల్ ప్రభుత్వ సేవలు చేపట్టనున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించామని ఆయన అన్నారు. 

ఒకప్పుడు ఇవే పరిశ్రమలు కరెంట్ కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేసేవన్న ఆయన  ఇప్పుడు అంతరాయం లేని విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికీ నీటి ఎద్దడి ఎదుర్కుంటున్న రాష్ట్రాలు ఉన్నాయన్న ఆయన 2050 వరకు నీటి కరువు రాకుండా తెలంగాణలో నీటి వనరులు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య లేదని, దేశంలోనే ది బెస్ట్ సిటీ హైదరాబాద్ అని అన్నారు. 

పరిశ్రమల సమాఖ్య తో చర్చించిన సీఎం.. టీఎస్ ఐపాస్ బిల్ తీసుకొచ్చారు. దేశంలో ఇలాంటి బిల్ ఎక్కడా లేదు అని ఆయన అన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించాయి.. పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. కరోనా కష్టాల నుంచి ఆదుకునేందుకు... 20 లక్షల కోట్ల ప్యాకేజీ మోడీ  ప్రకటించారు కానీ నాకు తెలిసి ఏ పరిశ్రమకూ అందలేదు... ఉపయోగపడలేదని అన్నారు. అలానే అన్ని రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్స్ తెస్తున్న మోడీ... హైదరాబాద్ ని మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆయన ఈసారి బడ్జెట్ లోనైనా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేస్తుందో చూడాలని అన్నారు. 

Back to Top