ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ గ్యాంగ్‌ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్
- January 23, 2021
హైదరాబాద్:తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ శాఖలో పట్టపగలే దోపిడీకి పాల్పడిన దొంగలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్.

వివరాల్లోకి వెళ్తే...నేషనల్ హైవే నుంచి మధ్యప్రదేశ్ కు పారిపోతుండగా శంషాబాద్ తొండూపల్లి వద్ద దొంగలను ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ దొంగలు తెలంగాణ వైపుకు వెళ్లే అవకాశం ఉండడంతో సైబరాబాద్ పోలీసుల సహకారం కోరారు తమిళనాడు పోలీసులు. దీంతో అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

తమిళనాడులో దోపిడీ చేసిన అనంతరం బంగారం బ్యాగులను ఓ కంటైనర్ లో తరలిస్తూ దాని వెనకాలే దొంగలు ఫాలో అయ్యారు. తొండుపల్లి చెక్ పోస్ట్ వద్ద సిబ్బందిని అలర్ట్ చేయడంతో దోపిడీ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను, 7 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 12 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

చోరీకి సంబంధించిన విషయాలను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నిన్న కృష్ణగిరి జిల్లాలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. చాలా తక్కువ సమయంలో దోపిడీ ముఠాను అరెస్ట్ చేశాం. తొండపల్లి టోల్‌ప్లాజా దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. కంటైనర్‌లో బంగారు అభరణాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన రూప్‌సింగ్ భాగాల్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించాం. మూడు నెలల క్రింతం లూథియానాలోని ముత్తూట్‌లో దోపిడీకి యత్నించారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు.

తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







