టీచర్లకు కూడా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన యూఏఈ

- January 24, 2021 , by Maagulf
టీచర్లకు కూడా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన యూఏఈ

యూఏఈ:ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యాక్రమాన్ని ముమ్మరం చేస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత విస్తృతం చేస్తోంది యూఏఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా మినిస్ట్రి, ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు టీచర్లను కూడా అదే జాబితాలోకి చేర్చింది. ఇక నుంచి టీచర్లకు కూడా ప్రతి 14 రోజులకు ఒక సారి ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ టీచర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టు ఖర్చులను టీచర్లే భరించాల్సి ఉంటుంది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు వైద్యపరంగా అర్హులు కాని వారికి మాత్రం మంత్రిత్వ శాఖ ఖర్చుతో పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను అలక్ష్యం చేస్తే వారికి వేతనాల్లో కోత విధించనున్నారు. మొదటి రెండు సార్లు లిఖత పూర్వకంగా హెచ్చరికలు చేసి..మూడో సారికి ఒక రోజు వేతనాన్ని కట్ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయినా..పీసీఆర్ టెస్ట్ చేయించుకోకుంటే నాలుగో సారికి మూడు రోజుల వేతనాన్ని, ఐదో సారికి ఐదు రోజుల వేతనాన్ని కట్ చేయనున్నట్లు హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com