అదృశ్యమైన విమానం కూలింది : నేపాల్‌

- February 24, 2016 , by Maagulf
అదృశ్యమైన విమానం కూలింది : నేపాల్‌

 నేపాల్‌ పర్వతాల్లో ఈ రోజు ఉదయం అదృశ్యమైన విమానం కూలిపోయింది. ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 23మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. విమానంలోని వారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నేపాల్‌లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు జామ్‌సోమ్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన 8 నిమిషాలకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం పర్వత శ్రేణుల్లో విమానం కూలిపోయిందని, ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందిందని జామ్సమ్‌ ప్రాంత పోలీసు చీఫ్‌ హరిహరి యోగి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com