డూడుల్ తో గూగుల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
- January 26, 2021నేడు భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా గూగుల్ చక్కటి డూడుల్ తో రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపింది. భారత దేశం విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలకు నెలవు.. రకరకాల కళలు, అనేక ఆచారాలు, బహుభాషల సమ్మేళనం.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న గుగూల్ జాతీయ జెండా రంగులను ప్రతిబించే విధంగా సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తూ.. డూడుల్ తయారు చేసింది.
ఇందులో ప్రధానంగా Googleలో రెండో Oను ఏనుగు అంబారీగా వేసి… సృజనాత్మకతను చాటుకుంది గూగుల్. అలాగే… రెండో G దగ్గర ఏనుగును ఓ వ్యక్తి వీడియో షూట్ చేస్తున్నట్లుగా ఆర్ట్ వేశారు. ఇక చివరి Eలో ఓ మహిళ తొంగి చూస్తున్నట్లు వేశారు. ఈ డూడుల్ భారత్ లోని నివసిస్తున్న అన్ని మతాల వారు, వివిధ రకాల ప్రజలు అందరూ ఉండేలా ఆర్ట్ వేశారు. దీంతో గూగుల్ రిపబ్లిక్ డే కి భారత్ విశిష్టతను చెప్పిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి