OMR4కే మస్కట్ టు సలాలాకు ఫ్లైట్..సలాం ఎయిర్ ఆఫర్
- January 26, 2021మస్కట్:ఒమన్ లోని లో బడ్జెట్ ఎయిర్ లైన్స్ సలాం ఎయిర్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 4 రియాల్స్ తో ఫ్లైట్ టికెట్ రాజధాని మస్కట్ నుంచి సలాలాకు ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా తమ ప్రయాణికులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు సలాం ఎయిర్ వెల్లడించింది. అయితే..ఈ ఆఫర్ జనవరి 30 ఒక్క రోజుకే పరిమితం అని స్పష్టం చేసింది. ప్రయాణికులు www.salamair.com వెబ్ సైట్ ద్వారా లేదా 2427-2222కి కాల్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జనవరి 30న మస్కట్ నుంచి సలాలాకు తమ తొలి కమర్షియల్ ఫ్లైట్ టేకాఫ్ అయిందని..అందుకే ఈ జనవరి 30 కేవలం 4 రియాల్స్ కే ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తున్నామని వివరించింది లో బడ్జెట్ ఎయిర్ లైన్స్. ఇదిలాఉంటే..సంస్థ ప్రకటించిన లో టికెట్ ప్రైజ్ ఆఫర్ కు ప్రయాణికులకు నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు...టికెట్లు వేగంగా అమ్ముడు పోతున్నట్లు సలాం ఎయిర్ వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?